ప్రశ్నలు

తరచుగా అడుగు ప్రశ్నలు

ఖాతా తెరవడం చాలా సులభం. ఖాతా తెరవడానికి సైన్ అప్ క్లిక్ చేసి, కొన్ని ప్రారంభ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత మీరు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్/ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPల ద్వారా మీ ఇమెయిల్ చిరునామా/ఫోన్ నంబర్‌ని ధృవీకరించాలి. మా వైపు నుండి తనిఖీ ద్వారా ధృవీకరణ చేయబడుతుంది మరియు వివరాలు సరిగ్గా ఉంటే ఖాతా తెరవబడుతుంది.

మీరు ఆన్‌లైన్ బదిలీ ద్వారా డబ్బును డిపాజిట్ చేయవచ్చు(నెట్ బ్యాంకింగ్, కార్డ్ బదిలీ, UPI బదిలీ). మీరు భౌతికంగా మా కార్యాలయానికి రావడం లేదా మా సంస్థ ఉద్యోగులను సంప్రదించడం ద్వారా కూడా డిపాజిట్ చేయవచ్చు.

మీరు మీ ఖాతా నుండి నగదు/డబ్బు ను వివిధ రకాల పద్దతులలో తీసుకోవచ్చు. మీరు మీ బ్యాంకు ఖాతాకు లేదా మొబైల్ ఫోన్ ఆధారిత బ్యాంకు ఖాతా కు నగదు/డబ్బు ను పంపించుకోవచ్చు. ఒకవేళ మీకు నగదు కావాలంటే మీరు మా బ్రాంచ్ కి రాగలరు లేదా మా సంస్థ ఉద్యోగులను సంప్రదించగలరు.

మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ మదింపు మీ పొదుపులు, డిపాజిట్లు, లావాదేవీల మొత్తం విలువ మరియు ప్రస్తుత సంవత్సరం పంట దిగుబడిపై ఆధారపడి ఉంటుంది.

మీరు మీ ఖాతా లో ఉన్న నగదు/డబ్బు, అప్పులు, ఖర్చులు, మరియు ఆదాయాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. మీరు మా స్టోర్‌ల నుండి వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఈ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.